![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -18 లో..... అంజలి కింద కూర్చొని రాజారావుతో మాట్లాడుతుంది. పైన కూర్చొ అమ్మ అని రాజారావు అంటాడు. పర్లేదు తాతయ్య ఇవన్నీ నాకు అలవాటే అని అంజలి అంటుంది. మీ అమ్మ చిన్నప్పడే వదిలేసింది కదా తనపై నీకు కోపం లేదా అని రాజారావు అడుగుతాడు. లేదు తాతయ్య తను ఏ పరిస్థితులలో ఇలా చేసిందో. కానీ ఒకటే బాధ ఇన్ని రోజులుగా తనకి నేను గుర్తు రాలేదా అని అంజలి ఏడుస్తుంటే రాజారావు పక్కకి వెళ్లి తను ఏడుస్తాడు.
ఆ తర్వాత అంజలి తోటలో పనులు చేస్తుంది. గీతాంజలికి తెలియకుండా ఎన్ని రోజులు అంజలి గురించి దాచాలని రాజారావు ఆలోచిస్తాడు. మరొకవైపు ఇప్పుడు అత్తయ్య చెప్పింది చెయ్యాలా.. తాతయ్య చెప్పింది చెయ్యాలా.. అత్తయ్య నాలుగు రోజుల్లో అంజలిని తీసుకొని రమ్మని చెప్పింది. అత్తయ్య చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది.. తాతయ్య విషయంలో కన్ఫ్యూషన్ ఉంది.. అత్తయ్య చెప్పింది చెయ్యాలని మనిష్ అనుకొని వెంటనే ఇంటికి వెళ్తాడు. అంజలి అంటూ పిలుస్తాడు. రాజారావు ఎదురుపడతాడు. అత్తయ్య నాలుగు రోజుల్లో అంజలిని తీసుకొని రమ్మంది. ఇప్పటికే అతయ్యకి పర్మిషన్ క్యాన్సిల్ అయింది. తను మీడియా ముందుకి రావాలని మనిష్ అనగానే అవసరం లేదు ఇప్పుడు అంజలిని తీసుకొని వెళ్లిన తన విషయం మీ అత్తకు చెప్పినా నా మీద ఒట్టే అని మనీష్ నోరు మూయిస్తాడు రాజారావు.
మరొకవైపు అంజలి రాత్రి కిచెన్ లో వర్క్ చేసుకుంటుంటే అప్పుడే రాకీ వస్తాడు. తనని చూసి ఇంత అందము.. ఎప్పుడు చూడలేదని అనుకొని తన దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. అమ్మగారిని చూసుకోవడానికి వచ్చిన పనిమనిషి అని అంజలి చెప్తుంది. బాగా చూసుకో ఇంట్లో ఎవరికి నచ్చినా నిన్ను అసలు వదిలిపెట్టరని రాకీ అంటాడు. ఎలాగైనా నిన్ను నా వైపుకి తిప్పుకోవాలని రాకీ అనుకుంటాడు. తరువాయి భాగంలో అంజలి ప్రొద్దున లేచి ముగ్గు వేస్తుంది. అమ్మాయి అంటే అలా ఉండాలని తన మనవరాలితో రత్నం అంటుంది. ఆ తర్వాత మనీష్ వస్తుంటే ముగ్గు తొక్కకుండా లోపలికి రా.. అప్పుడు నిన్ను హీరో అని ఒప్పుకుంటానని అంజలి అనగానే మనీష్ ముగ్గు తొక్కకుండా వస్తు పడిపోబోతుంటాడు. అప్పుడే అతడిని అంజలి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |